రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..! పైగా ధరలు కూడా తక్కువగా ఉండంతో చాలా మంది ట్రైన్ సర్వీస్లవైపే మొగ్గుచూపుతుంటారు.
మరి రైళ్లల్లో టాయిలెట్లు బాలేకపోతే! చాలా దారుణంగా ఉండి, అసలు లోపలికి వెళ్లలేని పరిస్థితి వస్తే? ఇలాంటి సంఘటనలు మీకు చాలాసార్లు ఎదురయ్యే ఉంటాయి. ఈ సమయంలో ఎవరికీ ఫిర్యాదు చేయలేకపోయేవాళ్లం. అయితే.. రైలు సేవల్లో ప్రయాణికుల సౌకర్యాలపై భారతీయ రైల్వే ఇటీవలి కాలంలో ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే కోచ్ క్లీనింగ్ సర్వీస్‌లను తీసుకొచ్చింది. ఏదైనా కోచ్‌లో టాయిలెట్లు ఆశుభ్రంగా ఉంటే, ఇప్పుడు మనం ఫిర్యాదు చేయవచ్చు. ఎలా అంటే..
శుభ్రమైన టాయిలెట్ల గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి.
ఆన్లైన్లో ఇలా ఫిర్యాదు చేయండి..
స్టెప్ 1:- ముందుగా cleanmycoach.com లోకి వెళ్లండి.
స్టెప్ 2:- మీ పీఎన్ఆర్ నెంబర్ టైప్ చేయండి.
స్టెప్ 3:- మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
How to avail Coach Mitra services : స్టెప్ 4:- దాని కింది సర్వీస్ అవైలబుల్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో క్లీనింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 5:- అక్కడ కనిపిస్తున్న కోడ్‌ను టైప్ చేయండి.
స్టెప్ 6:- సెండ్ రిక్వెస్ట్ పంపించండి.
ఈ రిక్వెస్ట్ అందిన కొంతసేపటికి రైల్వే సిబ్బంది వచ్చి సంబంధిత కోచ్‌లోని టాయిలెట్‌ను క్లీన్ చేస్తారు.
ఇదీ చూడండి:- ఢిల్లీ మెట్రోలో ఇక ఆల్కహాల్ తీసుకువెళ్లొచ్చు
ఎస్ఎంస్ ద్వారా ఫిర్యాదు చేయండి..
స్టెప్ 1:- 58888/ 9200003232 నెంబర్‌కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 2:- CLEAN< Space ><10 digit PNR number>< Space >SERVICE TYPE CODE టైప్ చేసి మెసేజ్ చేయాలి.
ఒక్క టాయిలెట్ క్లీనింగ్ మాత్రమే కాదు. వివిధ సేవలను అందిస్తోంది భారతీయ రైల్వే. అందుకోసం సర్వీస్ కోడ్లను ఏర్పాటు చేసింది.
కోడ్ C- క్లీనింగ్
W- కోచ్ వాటరింగ్
P- పెస్ట్ కంట్రోల్
B- బెడ్‌రోల్ రిక్వెస్ట్
E- ట్రైన్ లైటింగ్/ ఏసీ సేవలు
R- రిపైర్లు
వీటితో పాటు CoachMitra యాప్‌ను కూడా డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సేవలను పొందవచ్చు.
పైన చెప్పినవి పాటించినా.. సేవలు అందకపోతే మరో మార్గం కూడా ఉంది. 7208073768, 9136991728 నెంబర్లలో ఒకదానికి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే.. రైలులో అశుభ్రంగా ఉన్న టాయిలెట్లను క్లీన్ చేస్తారు. ఆ నెంబర్లకు కాల్ చేసి ఇతర సేవలను కూడా పొందవచ్చు
