[ad_1]
Telangana
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్:
నగరంలో
రేపు
ట్రాఫిక్
ఆంక్షలు
విధించనున్నారు.
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
మంగళవారం
హైదరాబాద్
వస్తున్న
నేపథ్యంలో
పలు
రూట్లలో
ట్రాఫిక్
ఆంక్షలు
విధించనున్నట్లు
ట్రాఫిక
పోలీసులు
ప్రకటించారు.
జులై
4న
ఉదయం
10
గంటల
నుంచి
10.30
గంటల
వరకు
హనుమాన్
ఆలయం,
హకీంపేట్
వై
జంక్షన్,
బొల్లారం
చెక్
పోస్ట్,
నేవీ
జంక్షన్,
యాప్రాల్
రోడ్,
హెలిప్యాడ్
వై
జంక్షన్,
బైసన్
గేట్,
లోత్‌కుంట
ప్రాంతాల్లో
వాహనాలకు
అనుమతి
ఉండదు.
అటుగావెళ్లే
వాహనాలను
వేరే
రూట్లకు
మళ్లించనున్నారు.
బొల్లారం,
అల్వాల్,
లోత్‌కుంట,
తిరుమలగిరి,
కార్ఖానా,
జేబీఎస్,
ప్లాజా
జంక్షన్,
పీఎన్‌టీ
ఫ్లైఓవర్..
రూట్లలో
వచ్చే
ట్రాఫిక్‌ను
మంగళవారం
ఉదయం
10
గంటల
నుంచి
సాయంత్రం
6
గంటల
వరకు
వేరే
రూట్లకు
మళ్లిస్తారు.
ఆ
వాహనాలను
హెచ్‌పీఎస్
అవుట్
గేట్,
బేగంపేట్
ఫ్లైఓవర్,
గ్రీన్‌ల్యాండ్స్
జంక్షన్
మోనప్ప
జంక్షన్,
ఎన్‌ఎఫ్‌సీఎల్,
ఎన్టీఆర్
భవన్,
జూబ్లీహిల్స్
చెక్
పోస్ట్,
రోడ్
నంబర్
45
జంక్షన్
వైపు
మళ్లిస్తారు.

ఈ
మేరకు
ఆయా
సమయాల్లో
వాహానదారులకు
ట్రాఫిక్
పోలీసులు
సూచనలు
జారీ
చేశారు.
ట్రాఫిక్
ఆంక్షలున్న
రూట్లలో
వాహనదారులు
అందుకు
అనుగుణంగా
ప్లాన్
చేసుకోవాలని,
ట్రాఫిక్
పోలీసులకు
సహకరించాలని
కోరారు.
ఈ
క్రమంలో
ట్రాఫిక్
పోలీసుల
సూచనలను
గమనించిన
వాహనదారులు
ప్రత్యామ్నాయ
మార్గాలను
చూసుకోవడం
మంచిది.
మాసాబ్
ట్యాంక్
బ్రిడ్జిపైనుంచి
భారీ
వాహనాల
ప్రవేశం
నిషేధం
మాసాబ్
ట్యాంక్
బ్రిడ్జిపైనుంచి
భారీ
వాహనాల
ప్రవేశాన్ని
నిషేధిస్తున్నట్లు
ట్రాఫిక్
పోలీసులు
ప్రకటించారు.
భారీ
వాహనాలు
రాకపోకలు
సాగించే
సమయంలో
ఒక్కోసారి
ఆగిపోతున్నాయని..
దీంతో
వంతెనపై
ట్రాఫిక్
జామ్
ఏర్పడుతోందని
పోలీసులు
తెలిపారు.
ఇలాంటి
సంఘటనలు
పునరావృతం
కాకుండా
ప్రజల
భద్రత
దృష్ట్యా
లారీలు,
ట్రావెల్స్
బస్సులు,
టిప్పర్లు,
పెట్రోల్,
సిమెంట్,
వాటర్
ట్యాంకర్లు,
టస్కర్
లాంటి
ఇతర
భారీ
వాహనాలకు
బ్రిడ్జిపై
అనుమతి
లేదని
స్పష్టం
చేశారు.
ఈ
వాహనాల
డ్రైవర్లు,
యజమానులు
బ్రిడ్జి
కింద
నుంచి
రాకపోకలు
సాగించాలని
సూచించారు.
నిబంధనలు
అతిక్రమిస్తే
చట్టపరమైన
చర్యలు
తీసుకుంటామని
హెచ్చరించారు.
English summary
Traffic diversions in some routes in Hyderabad city, due to president visit on July 4th.
Story first published: Monday, July 3, 2023, 19:53 [IST]
[ad_2]
Source link
