వైసీపీ నేతల అసభ్యకర కామెంట్లకు నా తల్లి నెలరోజుల పాటు కుమిలిపోయింది- నారా లోకేశ్-nellore yuvagalam padayatra nara lokesh criticizes ysrcp govt attacks on women increased

[ad_1]

మొదటి ఏడాదిలోనే మహాశక్తి సంక్షేమ పథకం అమలు

టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మహాశక్తి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ పై అత్యధికంగా పన్నులు వేసి ప్రజల రక్తం పీలుస్తుందని విమర్శించారు. ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఆదాయం, కమీషన్లు కోసం మద్యపాన నిషేధాన్ని గాలికొదిలేసినట్లు పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లు ఏపీలో మద్యం నిషేధించలేరని దానికి కారణం రాబోయే 25 ఏళ్లు మద్యం ఆదాయంపై వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చిందని ఎద్దేవా చేశారు. సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మహిళకు ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంభన కోసం రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సున్నా వడ్డీ రుణాలు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత విషయంపై మాట్లాడిని లోకేశ్ అధికారంలోకి వచ్చిన తరువాత చర్చించి తప్పుకుండా అనుకూల నిర్ణయం వచ్చేలా చేస్తామన్నారు.

[ad_2]

Source link

Posted Under AP
YES9 TV