Latest Posts

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 25మంది సజీవ దహనం!!

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ప్రమాద సమయంలో మొత్తం బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 25 మంది మృతి చెందారు. మిగతావారు గాయాల పాలయ్యారు.

బస్సు యవత్మాల్ నుంచి పూణే వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి రెండు గంటలకు శనివారం మహారాష్ట్రలోని బుల్దానాలోని సింద్ ఖేడ్ వద్ద సమృద్ధి మహా మార్గ్ ఎక్స్ప్రెస్ వైపై ప్రైవేటు బస్సు టైరు పేలటంతో బస్సు బోల్తా కొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

గాయపడినవారిని బుల్దానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి అని వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మృతుల సంఖ్య ప్రస్తుతం 26 కి పెరిగిందని సమాచారం.

తగ్గనున్న టమాటా ధరలు; మహిళలకు శుభవార్త!!

ఈ ఘటన పైన బుల్దాన ఎస్ పి సునీల్ కడసెన్ మాట్లాడారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. 25 మంది ప్రాణాలు కోల్పోయారు అని, ఇప్పటి వరకు బస్సు నుండి 25 మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు.

 

ఈ ప్రమాదంలో ఆరు నుండి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి అని పేర్కొన్నారు. బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

YES9 TV