Latest Posts

బళ్లారిలో బీటీపీఎస్ ను పరిశీలించిన మంత్రి

బళ్లారి/ బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన ఎన్నికల హామీ పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది.

అయితే కుడి చేతితో ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడమ చేతితో విద్యుత్ చార్జీలు పెంచేసిందని కర్ణాటక ప్రజలు ఆరోపిస్తున్నారు.

గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !

ఇప్పటికే గత నెల నుంచి విద్యుత్ చార్జీలు పెరిగిపోవడంతో ఎక్కువ శాతం మంది ప్రజలు మండిపడుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచింది మేము కాదని, గత బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, విద్యుత్ చార్జీలు పెంపుకు మాకు ఎలాంటి సంబంధంలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణ ఇచ్చారు.

 

ఇలాంటి సమయంలో కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి కేజే, జార్జ్ బళ్లారి పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారి తాలూకాలోని కుడితిని సమీపంలోని బీటీపీఎస్‌ని కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి శాఖ మంత్రి కేజే, జార్జ్‌ సందర్శించారు. బీటీపీఎస్ ని సందర్శించి పరిశీలించిన అనంతరం మంత్రి జార్జ్ బళ్లారి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు విద్యుత్ శాఖా మంత్రి జార్జ్ కు అక్కడి పరిస్థితులు వివరించారు.

భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !

YES9 TV