ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ వారాహి యాత్రతో మరోసారి కాపు రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి.
టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఏపీ ఎన్నికల్లో ఈ సారి కాపు ఓటింగ్ కీలకంగా మారుతోంది. పవన్ కాపు ఓటింగ్ ను తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కాపు ఓట్ బ్యాంక్ పై గురి:ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం ద్వారా జగన్ 151 సీట్లు సాధించారు. ఇప్పుడు జగన్ ను దెబ్బ తీయటానికి ఒక్కటైన చంద్రబాబు…
పవన్ ఓట్ బ్యాంక్ కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వారాహి యాత్ర పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రావటానికి లేదని పిలుపునిస్తున్నారు. అక్కడ కీలకమైన కాపు ఓట్ బ్యాంక్ తమకు అనుకూలంగా మారుతుందని జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే, ముద్రగడ.. వైసీపీ,జనసేన మద్దతు దారులుగా కాపు ఓటింగ్ లో చీలక కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో కొత్త స్కెచ్ అమలుకు సిద్దమవుతోంది.
కేసీఆర్ కీలక మంతనాలు:బీఆర్ఎస్ ను ఏపీలోనూ విస్తరించాని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమయ్యారు. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి అయిన బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతంతో పాటు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు ఉన్నారు.
