రైల్వే ట్రాక్ ను మార్చేదెవరు? ట్రాక్ షిఫ్టింగ్ అంటే?

రైలును సరైన దిశగా నడిపించడానికి కొన్ని జంక్షన్స్ లో రైలు ట్రాక్ లు మార్చుతుంది. ఈ ట్రాక్ లు వాటంతటవే అవతలివైపు ఎలా మారతాయో తెలుసుకుందాం. రైలు ఒక మార్గంలో దిశను మార్చాల్సి వచ్చినప్పుడు అది జంక్షన్ నుంచి వెళుతుంది.

రెండు ట్రాకులకన్నా ఎక్కువగా ట్రాక్ మార్చాల్సి ఉంటుంది. లాకింగ్ సిస్టంపై ట్రాక్ పనిచేస్తుంది. ప్రధానమైన ట్రాక్ కు సమీపంలో మరో ట్రాక్ ఉంటుంది. ట్రాక్ మార్చేందుకు అనువుగా మరో ట్రాక్ తో అనుసంధానిస్తారు.

రైలును ముందుగా నిర్దిష్ట దిశలో పంపిస్తారు. అప్పుడు సపోర్ట్ తో ఉన్న పాయింటెడ్ ట్రాక్ ను సర్దుబాటు చేసి ప్రధానమైన ట్రాక్ కు కలుపుతారు. దీనితర్వాత రైలు చక్రాలు మారుస్తుంది. సపోర్ట్ ట్రాక్ కు చేరుకున్న తర్వాత రైలు దిశ మారుతుంది. గమ్యంవైపు పయనిస్తుంది. దీనిని ట్రాక్ షిఫ్టింగ్ అంటారు.

ట్రాక్ లపై ప్రతిరోజు వందల సంఖ్యలో రైళ్లు నడుస్తుంటాయి. దీంతో ట్రాక్ షిఫ్టింగ్ పని రోజంతా ఉంటుంది. రైళ్లు దాటిన తర్వాత సపోర్ట్ ట్రాక్ ను ప్రధాన ట్రాక్ నుంచి వేరుచేస్తారు. రైలు తన దిశను మార్చుకునే సమయంలో లోకో పైలెట్ ప్రమేయం ఉండదు. అతను సొంతంగా రైలును నడపడానికి అవసరమైన ఏ పరికరాలు అతని దగ్గర ఉండవు. ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్ కు ఆటోమాటిక్ గా జరుగుతుంది. గతంలో ఈ పనిని రైల్వే ఉద్యోగి చేసేవారు.

YES9 TV