ట్రైన్ డ్రైవర్ 6 సార్లు చిన్న హారన్ ఇస్తే?

రైలు లోకో పైలెట్ హారన్ వినిపిస్తే గార్డులకు, సిబ్బందికి, ప్రయాణికులకు హెచ్చరికగా పనిచేస్తుంది. లోకో పైలెట్ మొత్తం 11 హారన్లు కొడతాడు. ఒక్కోదానికి ఒక్కో సంకేతం ఉంటుంది.

రైలు స్టేషన్ లోకి వస్తోందని, ప్రమాదకరంగా ఉందని, లైన్లను మార్చమని.. ఇలా పలు అర్థాలున్నాయి. అవేంటనేది తెలుసుకుందాం.

1. ఒక చిన్న హారన్: యార్డుకు తీసుకువెళ్లి రైలును శుభ్రం చేసేందుకు అని అర్థం వస్తుంది.

2. రెండు చిన్న హారన్లు: రైలును స్టార్ట్ చేయాలంటూ సిగ్నల్ కు సూచించాలని గార్డును పైలట్ అడుగుతున్నట్లుగా అర్థం వస్తుంది.

3. మూడు చిన్న హారన్లు: ఇది చాలా అరుదుగా ఇస్తుంటారు. లోకో పైలెట్ మోటారుపై కంట్రోల్ కోల్పోయాడని, గార్డు వెంటనే వాక్యూమ్ బ్రేక్ ను లాగాలంటూ సూచించే అర్థం వస్తుంది.

4. నాలుగు చిన్న హారన్ సిగ్నల్స్: సాంకేతికంగా సమస్య ఎదురైనప్పుడు ఇలాంటి హారన్లు ఇస్తాడు. బండి ముందుకు కదలదు.

5. నిరంతరాయంగా హారన్: స్టేషన్ లో రైలు ఆగదని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించేలా నిరంతరాయంగా హారన్ ఇస్తుంటారు.

6. ఒక లాంగ్ హారన్, ఒక చిన్న హారన్: బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయమని గార్డుకు సూచన అందుతుంది. ఇంజన్ ప్రారంభించడానికి ముందు పైలెట్ దీన్ని ఇస్తారు.

7. రెండు లాంగ్, రెండు షార్ట్ హారన్స్: ఇంజన్ ను నియంత్రించమని పైలెట్ గార్డుకు సంకేతాలివ్వడం.

8. రెండు స్టాప్‌లతో రెండు హారన్లు: రైల్వే క్రాసింగ్ గుండా బండి ప్రయాణిస్తోందని, సిగ్నల్ దగ్గర బాటసారులు అప్రమత్తంగా ఉండాలనే అర్థం వస్తుంది.

YES9 TV