క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

భారతదేశంలో ఎన్నో మతాలున్నాయి. కానీ ఆ మతంకన్నా ఎక్కువగా క్రికెట్ ను ప్రేమిస్తారు. 140 కోట్ల భారతీయులది ఒకే మతం.. అది క్రికెట్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ క్రికెట్ ను సంపూర్ణంగా ఆస్వాదిస్తారు.

మ్యాచ్ ఉందంటే చాలు.. పనులన్నీ వాయిదా వేస్తారు.. టీవీలకు అతుక్కుపోతారు. మనదేశంలో క్రికెట్ ను నియంత్రిస్తున్న బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా బోర్డుగా, క్రికెట్ లో అన్నిబోర్డులకంటే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే బోర్డుగా రూపాంతరం చెందింది. అటువంటి బీసీసీఐ తన క్రికెటర్లకు ఎటువంటి ఆహారం పెడుతుంది? వారి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తుందో తెలుసుకుందాం.

లంచ్ బ్రేక్ లో : క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు దొరికే సమయాన్ని బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను, ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటుంటారు. క్రికెటర్లకు అలసట రానివ్వకుండా ఉండేందుకు అరటిపండును ఎక్కువగా తీసుకుంటారు. అలాగే ప్రొటీన్ బార్ వంటివి కొంచెం పరిమాణంలో అతి తక్కువగా తీసుకుంటారు. ఈ తరహా ఫుడ్ ను బ్యాట్స్ మెన్స్ తీసుకుంటుంటారు. బౌలర్లు కూడా అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటారు.

ఆటగాళ్లే కాకుండా : బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే వాళ్ళు.. బౌలింగ్ టీంలో ఫీల్డింగ్ చేసేవారికి ఏదైనాసరే తినడానికి అవకాశం ఉంటుంది. బోర్డు కూడా వీరికి చాలా భిన్నరకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతుంది. నాన్ వెజ్ తినే ఆటగాళ్లకు ప్రొటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు వారి ఆహారంలో కంపల్సరీగా ఉంటాయి. నాన్ వెజ్ తిననివారికి పప్పులు, ఫ్రూట్ సలాడ్ లాంటివి ఏర్పాటు చేస్తారు. భోజనం చివరలో పళ్లతోపాటు డిసర్ట్ కూడా ఇస్తారు. కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీమ్ లను అందుబాటులో ఉంచుతారు. ఇతర దేశాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను బట్టి, వారి ఆహారపు అలవాట్లను బట్టి ఫుడ్ లభిస్తుంది.

YES9 TV