ఆసియా కప్, వరల్డ్ కప్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. ఆసియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను హాట్ స్టార్ ఫ్రీ చూడవచ్చని ప్రకటించింది.
అయితే ఈ అవకాశం కేవలం మొబైల్ యూజర్లకే కల్పించింది. ఈ మధ్య ముగిసిన ఐపీఎల్ 2023ని జియో సినిమాలో ఉచితంగా అందించారు. దీంతో డిస్నీ+ హాట్‌స్టార్ పై ఒత్తిడి పెరిగింది. చాలా చందాదారులు డిస్నీ+ హాట్‌స్టార్ వెళ్లిపోయారు.
దీంతో ముకేశ్ అంబానీ జియో సినిమా తట్టుకునేందుకు సియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను ఉచితంగా అదిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OTT పరిశ్రమలో డిస్నీ+హాట్‌స్టార్ ముందంజలో ఉందని డిస్నీ+హాట్‌స్టార్ అధినేత సజిత్ శివానందన్ తెలిపారు. వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం మేము ప్రవేశపెట్టిన వివిధ ఆవిష్కరణలు మా ప్రేక్షకులను ఆనందపరిచేలా చేశాయన్నారు.
ఆసియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లను విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇండియాలోలో 540 మిలియన్లకు పైగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రాబోయే ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్లను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. టీవీల్లో మ్యాచ్‌లను చూసే వారికి కూడా ఈ ఉచిత ఆఫర్ వర్తించదని చెప్పారు.
JioCinema, అంబానీల నేతృత్వంలోని స్ట్రీమింగ్ సర్వీస్, 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో వీక్షకులను సంపాదించుకుంది. రిలయన్స్ వయాకామ్ 18 IPL డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 2023 నుండి 2027 వరకు సుమారు $2.9 బిలియన్లకు దక్కించుకుంది.
గతంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను డిస్నీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా అందించింది. గత నెలలో JioCinema సంవత్సరానికి ₹999 ప్రీమియం ధరను ప్రకటించింది. ఆసియా కప్ సెప్టెంబర్ 2న ప్రారంభమై 17న ముగుస్తుంది. పురుషుల ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది.
