బెంగళూరు/బళ్లారి: బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) చదివేందుకు బళ్లారి నుంచి వచ్చి చిన్నపిల్లల డాక్టర్ కావాలనే ఆశతో ఎండీ చదువుకుంటున్న విద్యార్థిని కోలార్‌లోని చెరువులో శవమై కనిపించింది.
కాలేజీలో వేధింపులు, తండ్రిని పోగొట్టుకోవడంతో మనస్థాపానికి గురైన యువతి స్నేహితుడికి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.
బెంగళూరు రూరల్ జిల్లా హోస్ కోటేలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్న విద్యార్థిని దర్శిని కోలార్ తాలూకాలోని కెందట్టి గ్రామంలో క్వారీలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని బళ్లారికి చెందిన దర్శినిగా గుర్తించామని పోలీసులు అంటున్నారు. హోస్ కోటే లోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ ఎండీ చేస్తున్న దర్శిని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
మేనమామ భార్యతో మస్త్ మజా, అర్దరాత్రి మిడ్ నైట్ మసాలా, స్పాట్ లో ఫినిష్ !
ఆదివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కాలేజీ వదిలి నేరుగా కోలార్ తాలూకా కెందట్టి సమీపంలోని క్వారి దగ్గరకు వెళ్లింది. చెప్పులు, మొబైల్ ఫోన్ తీసి క్వారీ బయటపెట్టింది. అదే సమయంలో తన స్నేహితుడు మణికి ఫోన్ చేసిన దర్శిని తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతున్నానని చెప్పంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని దర్శిని ఆమె స్నేహితుడు మణికి చెప్పింది.
అ సందర్భంలో మణి స్నేహితురాలు దర్శిని తల్లితో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ దర్శిని కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. మళ్లీ ఎంత ప్రయత్నించినా దర్శిని కాల్ రిసీవ్ చేసుకోలేదు. అప్పటికే దర్శిని క్వారీలోని నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో ప్రతిభ కనబరిచిన దర్శిని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉచితంగా ఎండీ సీటు సాధించింది. అదనంగా, ఆమె పెద పిల్లల కోసం స్పెషలిస్ట్‌గా పనిచేయాలని ఆశపడింది.
