రిజర్వ్ బ్యాంక్ లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేసిన ఆరోపణపై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌ అధికారులు ఓ యువకుడిని అరెస్టు చేశారు.

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న వైభవ్‌ భగవాన్‌ అలియాస్ వైభవ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆ రైలులో ఐటీ హబ్ ప్రజలు ఎందరు ఉన్నారంటే ?, రైల్వే శాఖ అధికారుల క్లారిటీతో!

గురువారం తెల్లవారుజామున వైభవ్ భగవాన్ అతని మొబైల్‌ ఫోన్ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ చేశాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కు ఫోన్ చేసి రిజర్వ్ బ్యాంక్ కు బాంబు బెదిరింపులు చేశాడని పోలీసులు అన్నారు. కంట్రో ల్ రూమ్ ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విధానసౌధ పోలీసులు తెలిపారు.

ఫోన్ కాల్‌ వచ్చిన మొబైల్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు వైభవ్ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ కాలేజీలో బీకామ్ చదువుతున్న వైభవ్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఐదేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో వైభవ్ వైద్య చికిత్స పొందుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

YES9 TV