పీఎం ఈవెంట్ లో సీఎం జగన్ స్పెషల్ అట్రాక్షన్ – ఎంపీ రఘురామ ఏం చేసారంటే..!!

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ హాజరయ్యారు. ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రారంభోత్సవం చేయటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రులు…భాగస్వామ్య పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాయి.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. ప్రధానికి మద్దతుగా నిలిచారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో తొలి వరసలో నిలిచి ప్రత్యేకార్షణగా నిలిచారు. కేంద్రం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

పార్లమెంట్ లో సీఎం జగన్ : ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు జరిగిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీ నుంచి సాయిరెడ్డి లేదా పార్టీ ఎంపీలు హాజరయ్యేవారు. ఈ సారి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ గతంలో చేసిన వినతులకు కేంద్రం ఒక్కో అంశం పరిష్కరిస్తోంది. ఆర్దికంగా తోడ్పాటు అందించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమయంలో రాజకీయంగానూ రాష్ట్రంలో ప్రత్యర్దులుగా ఉన్న టీడీపీ, జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు సిద్దమయ్యాయి. ఈ సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి : పార్లమెంట్ ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని లక్ష్యంగా 20 ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. ప్రధాని తీరును తప్పు బట్టాయి. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఈ సమయంలో జగన్ చొరొవ తీసుకున్నారు. ట్వీట్ చేసారు. ప్రధాని మోదీకి సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాల్లో రాజకీయాలు తగవని..కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతిపక్షాలకు సూచించారు. దీనిని బీజేపీ వ్యతిరేక పార్టీలు తప్పు బట్టాయి. ఇక నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈరోజు ఉదయం నుంచి పార్లమెంట్ ప్రారంభోత్సవం.. ప్రధాని ప్రసంగానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో కలిసి తొలి వరుసలో నిలిచారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యులు మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. తటస్థంగా ఉంటూ లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీ అధ్యక్షుడుగా జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాల్గొన్న ఎంపీ రఘురామ : ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ జన్మదినం కావటంతో పార్లమెంట్ ప్రాంగణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. పోలవరం వ్యవహారంలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో సీఎం సమావేశమయ్యారు, ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో అదే మంత్రితో రఘురామ సెల్ఫీలు తీసుకున్నారు. నూతన పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం సమయంలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ముందువరుసలో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పక్కన ఆశీనులయ్యారు. వెనుక వరుసల్లో రఘురామ ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.

YES9 TV