సంచలన రికార్డుల దిశగా ‘ఆదిపురుష్’ బిజినెస్

విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ హాట్ హాట్ గా మారింది. ట్రైలర్ రాకముందు వరకు వ్యతిరేకతను, అనుమానాలను ఎదుర్కొంది.

ఎప్పుడైతే ట్రైలర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను విడుదల చేసేందుకు పోటీపడుతున్నారు.

ఈ రామాయణ గాథను ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 160 నుంచి 170 కోట్ల రూపాయల మధ్యలో థియేట్రికల్ డీల్స్ పూర్తవబోతున్నాయి. యూవీ సంస్థనే పంపిణి చేయాలని పోటీ పడినప్పటికీ సాహో, రాధే శ్యామ్ తాలూకు సెటిల్మెంట్లు ఇంకా పెండింగ్ ఉండటంతో ఆ సంస్థ డిస్ట్రిబ్యూషన్ నుంచి వెనకంజ వేసింది. యూవీ స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను కొనుగోలు చేసి భారీగా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

చిత్రయూనిట్ కు, పీపుల్స్ మీడియాకు మధ్య ఒప్పందం కూడా ముగిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశ్శాన్ని అంటుతున్నాయి. జైశ్రీరామ్ పాట విడుదలైన తర్వాత హైప్ కి పట్టపగ్గాలుండవని, భారత చలనచిత్ర పరిశ్రమలోనే భారీ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు నెలల నుంచి అన్నివర్గాలను థియేటర్లకు రప్పించిన సినిమా రాలేదు. ఆ లోటు ఆదిపురుష్ తీరుస్తుందే ధీమా టీ సిరీస్ లో కనిపిస్తోంది.

ఆదిపురుష్ కు సంబంధించిన వార్తలతో సినిమా ప్రియులు, ట్రేడ్ వర్గాలు బిజీ కాబోతున్నాయి. జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా 80 శాతం థియేటర్లలో ఈ ఒక్క సినిమా వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. మల్టీప్లెక్స్ లు ఆడియన్స్ ను భారీసంఖ్యలో రప్పిస్తాయనుకుంటున్నారు. సినిమా బాగుందనే టాక్ వస్తే మాత్రం ఉత్తర భారతదేశంలో రికార్డులన్నీ బద్ధలవుతాయంటున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నారు.

YES9 TV