హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ ఘటనలో రెండు కార్లతో పాటు బైకులు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది. ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
