కేసీఆర్ మీద అపార నమ్మకం.!మహారాష్ట్ర నుంచి వెల్లువలా చేరికలు.!

మహారాష్ట్ర/హైదరాబాద్ : దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల వెల్లువ కొనసాగుతుంది.

మహారాష్ట్ర నుండి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, పలు జిల్లాల నుంచి మాజీ జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ నరగ పాలక సంస్థల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా, నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరి దేశానికి దారి చూపే గొప్ప నాయకత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రూపంలో చూసుకుంటున్నారనే సందేశాన్ని ఇచ్చారు.

ఇదే కోవలో మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్, పర్భణీ, లాతూర్ జిల్లాలకు చెందిన బిజెపి, ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, పలువురు ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు వారికి గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో పర్భని మాజీ జెడ్పీ ఛైర్మన్ మహేష్ మాధవ్ రావు ఫాడ్, మాజీ ఎమ్మెల్యే మోహన్ ఫాడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవటి మున్సిపల్ ఛైర్మన్ అంకోష్ గొటవలే, బిఎస్పీ పార్టీ రాజురా నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే భానుదాస్ జాదవ్, , సంతోష్ గోట్వాలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జీవటి తాలూకా ప్రెసిడెంట్ ఆశిష్ నంవాడ్, కేకేజారి సర్పంచ్ మారుతీ మోరే, ముంబైలోని బిజెపి కాంఘర్ యూనియన్ కు చెందిన దిలీప్ రక్, లాతూర్ అడ్వకేట్ లు అఖిల్ దేశ్ ముఖ్, బాలాజీ దైర్య తో సహా పలువురు ప్రముఖులు, నాయకులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెంట ఉన్నారు.

YES9 TV