మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు.
ప్రస్తుతం ఇండియాలో బేస్ వేరియంట్‌ను తీసుకొచ్చారు.
మోటరోలా ఎడ్జ్40 ధర : మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఎడ్జ్ 40 ని విడుదల చేశారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇండియాలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.29,999. మే 23 నుంచి ప్రీ-ఆర్డర్లు మొదలవగా 30వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద కొంత రాయితీ వస్తోంది. ల్యూనార్ బ్లూ, ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.
మోటరోలా ఎడ్జ్40 స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 40 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ (2400 x 1080 pixels) తెరతో వచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 5జీ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ ఆప్షన్‌తో వచ్చిన స్తున్న ఈ ఫోన్ e-SIMను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై పనిచేస్తుంది. రెండు సంవత్సరాలపాటు ఓఎస్ అప్‌డేట్లు, మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నారు. వెనుక భాగంలో 50 ఎంపీ, ముందు 32 ఎంపీ కెమెరా, 68వాట్ టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీతో వచ్చింది. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్ కనెక్టివిటీని ఇస్తున్నారు. వైర్‌లెస్ టెలిఫోన్ హ్యాండ్‌సెట్ విభాగం సెల్యులార్ టెలిఫోన్‌లలో మోటరోలా అగ్రగామి. 2004కి ముందు పర్సనల్ కమ్యూనికేషన్ సెక్టార్ (PCS) అని కూడా పిలిచేవారు.
