Latest Posts

అమరావతి వేదికగా జగన్ కొత్త అస్త్రం – ప్రతిపక్షాలకు చెక్..!!

అమరావతి విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న జగన్ అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆర్ 5 జోన్ లో 50 వేల మందికి ఇంటి స్థలాల పంపిణీ ద్వారా తమ ఓట్ బ్యాంక్ అక్కడ సుస్ధిరం చేసుకుంటున్నారు.

పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అండ్ కో అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. అమరావతి సెంటిమెంట్ ఆ ప్రాంతంలో తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్న వేళ ఇది కీలక నిర్ణయంగా మారుతోంది.

జగన్ వ్యూహాత్మక అడుగులు:ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. దీని పైన అమరావతిలో నిరసన వ్యక్తం అయింది. ప్రతిపక్ష పార్టీలు అమరావతికి అనుకూలంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతంలో వైసీపీ పైన రాజకీయంగా పై చేయి సాధించాలని ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఈ సమయంలోనే అమరావతిలో ఇంటి స్థలాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పయత్నాలకు న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో, ఒకేసారి 50 వేల మందికి ఆర్ 5 జోన్ లో ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం సిద్దమైంది.

Posted Under AP
YES9 TV