Latest Posts

కస్టడీకి కర్మ ఎఫెక్ట్.. వెంకట్ ప్రభుపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కి కస్టడీ సినిమా ఇటివల విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అటు తమిళంలో కూడా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కస్టడీ (Custody) మూవీ తెలుగులో వెంకట్ ప్రభుకి, తమిళంలో నాగ చైతన్యకు ఎంట్రీ సినిమా కావడం విశేషం. అయితే.. ఇప్పుడీ సినిమా విషయంలో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ దర్శకుడు వెంకట్ ప్రభుని . కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే..

ప్రభాస్ హీరోగా 2019లో వచ్చిన సాహో హిందీలో తప్ప అన్నిచోట్లా ఫ్లాప్ అయింది. సాహోతోపాటు తమిళంలో వైభవ్ హీరోగా సిక్సర్ అనే సినిమా వచ్చింది. సాహో ఫ్లాప్ టాక్ రావడంతో పరోక్షంగా స్పందించిన వెంకట్ ప్రభు.. ‘ఈ వీకెండ్ సిక్సర్ గ్యారంటీ’ అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇదే ట్వీట్ ని ప్రభాస్ రీట్వీట్ చేస్తూ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కాస్త ఆలస్యమైనా ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది అనే క్యాప్షన్ తో ట్రోల్ చేస్తున్నారు.

YES9 TV