పేరున్న దర్శకుడి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. అతి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విలక్షణ హీరో అల్లరి నరేష్. మొదట్లో కామెడీ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన అతడు..
కొంత కాలంగా సీరియస్ సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇటీవలే ఈ టాలెంటెడ్ హీరో ‘ఉగ్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో ‘ఉగ్రం’ మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!
ఉగ్రం అంటూ వచ్చిన నరేష్:హిట్ కోసం చూస్తోన్న అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా సినిమానే ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.
బట్టలన్నీ విప్పేసి తెగించిన జబర్ధస్త్ ప్రియాంక: హీరోయిన్లు కూడా ఇలా చూపించరుగా!
ఉగ్రం మూవీ బిజినెస్ డీటేల్స్:క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ‘ఉగ్రం’ మూవీకి నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 5.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.
6వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:‘నాంది’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత అల్లరి నరేష్ – విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే ‘ఉగ్రం’. ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఈ క్రమంలోనే ఆరో రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 లక్షలు షేర్‌నే వసూలు చేసింది.
6 రోజులకూ ఎంత వచ్చింది?:6 రోజుల్లో ‘ఉగ్రం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 96 లక్షలు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. రూ. 2.52 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
