ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతారంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతూ ఉంది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ…వైసీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. దీంతో చంద్రబాబు ఇంకా లోకేష్…టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపేలా యాత్రలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోపక్క వైసీపీ అధినేత సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నేతల పనితీరుపై అప్ డేట్ లు తెలుసుకుంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. నిత్యం ప్రజలలో ఉండాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేత సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ దోపిడీ జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా అక్రమాలను బయటపెడతామని పేర్కొన్నారు. జరిగిన అవినీతిపై జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత… ఆయన చాలా క్లారిటీగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ – జనసేన ప్రభుత్వం స్థాపిస్తుందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.
