మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండటంతో… కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.
ఎలాగైనా అధికారాన్ని కైవాసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవడానికి.. ఉన్న అవకాశాలు అన్నిటిని ఉపయోగిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన కీలక నాయకులు పలువురు కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని మోడీ ఎన్నికల షెడ్యూల్ గురించి బీజేపీ సీనియర్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజుల్లో 22 ర్యాలీలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. బెంగళూరులో శనివారం భారీ రోడ్ షో చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మే 2,3..6,7 తారీకులలో ర్యాలీలు ఉంటాయని స్పష్టం చేశారు. మే 10వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇంకా మే 13 వ తారీకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
