Latest Posts

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవఫ్లయిట్ లో గొడవపడి అద్దాన్ని పగలకొట్టారు. అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో

హిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవ అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్లేస్ మారినంత మాత్రానా వారి మధ్య గొడవలు ఉండవన్ కాదు. అది నేల మీద అయినా గాల్లో అయినా.

రీసెంట్ గా ఫ్లైట్ గాల్లో ఉండగా ముగ్గురు మహిళల మధ్య గొడవ జరిగింది. అది చిన్నగా మొదలై దాదాపు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏకంగా ఆ ఫ్లైట్ అద్దాలు పగల గొట్టేలా చేసింది. వారు చేసిన ఈ హంగామా వల్ల ఫ్లైట్ ని అత్యవసరమగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో అని తెలుస్తుంది. క్విన్స్ లాండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీకి వెళ్లే ఫ్లైట్ లో ఈ గొడవ జరిగంది. ఫ్లైట్ లో చిన్న తగాదాగా మొదలైన ఈ ఫైట్ ఏకంగా గాజు సీసాతో ప్రయాణికుల మధ్య దాడికి దారి తీసింది. ఒకరినొకరు తోసుకోవడం వల్ల గొడవ పెద్దదైంది. ఫ్లైట్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ గొడవ ఆగలేదు. ఇక చేసేది లేక ఆ ఫ్లైట్ ని క్విన్ ల్యాండ్స్ లో ఆపాల్సి వచ్చింది. ఈ గొడవలో ఫ్లైట్ కిటికీ కూడా పగలగొట్టారని తెలుస్తుంది. ఈ గొడవకు కారణమైన నలుగురు ప్రయాణీకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

 

YES9 TV