Latest Posts

సక్సెస్ తర్వాత ఆ స్టార్ హీరోలు ఫోన్.. దిల్ రాజు కాల్ చేసి ఏమన్నారంటే..

విరూపాక్ష చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా ఎస్వీసీసీ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండు తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..

గోదావరి జిల్లాలో జన్మించి…: నేను గోదావరి జిల్లా రావులపాలెంలో పుట్టాను. వైజాగ్‌లో పెరిగి పెద్దయ్యాను. నేను ఇంటర్మీడియెట్ చదువుతుండగా నాన్న గారు చనిపోయారు. దాంతో నన్ను, నా తమ్ముడిని అమ్మ పెంచారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తమ్ముడు నాకు అండగా నిలిచారు. నా తమ్ముడు కువైట్‌ వెళ్లి నాకు సపోర్ట్ చేశాడు. దర్శకుడు సుకుమార్‌ గారు ఈ సినిమాను ఓకే చేయగానే, మా తమ్ముడు రిజైన్‌ చేసి ఇండియాకు వచ్చేశాడు అని కార్తీక్ దండు తెలిపారు.

అరుంధతి, చంద్రముఖి మిక్స్ అంటూ : విరూపాక్షను చూసిన తర్వాత అరుంధతి, చంద్రముఖి తరహా ఉందని. ఆ రెండు సినిమాలు మిక్స్ చేస్తే విరూపాక్ష అన్నారు. అయితే కథాపరంగా అలాంటిది లేదు. కానీ సక్సెస్ పరంగా ఆ రెండు సినిమాలకు మిక్స్ అని నమ్ముతున్నాను. హారర్‌ జోనర్‌కి సెలెక్టివ్‌ ఆడియన్స్ అనడం కన్నా, వైడ్‌ రేంజ్‌ ఆడియన్సే ఉన్నారు అని కార్తీక్ దండు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

హారర్ సినిమాలంటే.. : సాధారణంగా తెలుగు ప్రేక్షకులు హారర్‌ సినిమాలను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో లేడీస్‌, పిల్లలు ఎక్కువగా హారర్‌, థ్రిల్లర్‌ ఫిల్మ్స్ ఇష్టపడతారన్నది నా అనుభవంతో తెలుసుకున్న సినిమా. చంద్రముఖిలాంటి సినిమాలు అందుకే అంత హిట్‌ అయ్యాయి. మిగిలిన ఎమోషన్స్‌ను రియల్‌ లైఫ్‌లో ఇష్టపడతాం. కానీ, హారర్‌ని మాత్రమే మనం స్క్రీన్‌ మీద చూస్తాం. మిగిలిన ఏ ఎమోషన్‌ను మనం రియల్‌ లైఫ్‌లో చూడం అని కార్తీక్ దండు తెలిపారు.

కాంతారాను ఫాలో అవుతున్నాం: విరూపాక్ష సినిమాను హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ విషయంలో కాంతార ఫార్మాట్‌ను ఫాలో అవుతాం. ఇక్కడ మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యాక, మిగిలిన భాషల్లో రిలీజ్‌ చేస్తాం. రెండు వారాల తర్వాత రిలీజ్‌ చేస్తే ఇంకా రీచ్‌ ఎక్కువగా ఉంటుంది. తెలుగు వెర్షన్‌ షోస్‌ బెంగుళూరులో సోమవారం నుంచి పెరుగుతున్నాయి అని కార్తీక్ తెలిపారు.

 

దిల్ రాజు నుంచి చిన్న నిర్మాతల వరకు : విరూపాక్ష సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నుంచీ ఒక సినిమా చేసిన చిన్న నిర్మాతల వరకు ఫోన్ చేసి అభినందించారు. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మరో సినిమా కోసం నేనింకా ఎవరి దగ్గరా అడ్వాన్సులు తీసుకోలేదు. నా వద్ద రెండు, మూడు స్టోరీ ఐడియాస్ ఉన్నాయి. విరూపాక్ష సినిమా జర్నీలో సుకుమార్‌తో ఒక స్టోరి డిస్కస్ చేశాను. ఆ కథ ఆయనకు నచ్చింది. మళ్లీ సినిమా చేస్తే.. హారర్ థ్రిల్లర్ అవుతుంది అని కార్తీక్ దండు స్పష్టం చేశారు.

YES9 TV