Latest Posts

మార్గదర్శి(Margadarsi) చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మార్గదర్శి(Margadarsi) చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎంత చెల్లించారు? తదితర అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాలని ప్రశ్నించింది. జస్టిస్ సూర్య కుమార్, జస్టిస్ పర్దీవాలా నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం ఈ కేసు పై విచారణ జరిపింది.

డిపాజిటర్లు అందరికీ చెల్లింపులు విధిగానే చేసామని మార్గదర్శి తరపు లాయర్ ధర్మాసనం ముందు తెలుపగా.. ఆ వివరాలు బయట పెట్టడంలో అభ్యంతరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది.

మరోవైపు సుప్రీం వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 17 సంవత్సరాల తన పోరాటంలో ఇదో కీలక మలుపని అభిప్రాయపడ్డారు. మొదటినుంచి తాను మార్గదర్శికి ఇదే ప్రశ్నలు సంధిస్తున్నానని.. ఈరోజు ధర్మాసనం కూడా తనతో ఏకీభవించడం ఆనందంగా ఉందన్నారు. డిపాజిట్లను ఎంతమందికి చెల్లించారు? వాటిని చెక్కు రూపంలో ఇచ్చారా? మరే రూపంలో అయినా చెల్లించారా? ఒకచోట హెచ్.యు.ఎఫ్ అని మరోచోట ప్రోప్రైటరీ అని ఎందుకు రాయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు

YES9 TV