అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ చిత్రం ను ఈనెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా చివరి సాంగ్ చిత్రీకరణ సాగుతోంది. ఈ సాంగ్ లో ఊర్వశి రౌతేలా పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో సందడి చేసిన ఈ అమ్మడు అఖిల్ కు జోడీగా నటించడం.. అది కూడా ఐటం సాంగ్ లో నటించేందుకు సిద్ధం అవ్వడంతో ఏజెంట్ స్థాయి అమాంతం పెరిగినట్లే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ ఫ్యాన్స్ కూడా ఏజెంట్ సినిమా ఈసారి మ్యాజిక్ చేయడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు.
సురేందర్ రెడ్డి గత చిత్రాల నేపథ్యంలో ఈ సినిమాకు కాస్త ఎక్కువగానే ఖర్చు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా చివరి పాట షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వారం రోజుల్లో సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
