Latest Posts

వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యమని పేర్కొన్నారు జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..

బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం జరిగిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఏపీని విముక్తి చేయాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే పొత్తుల గురించి ఇంకా మాట్లడలేదని సమయం వచ్చినప్పుడు చెబుతామని తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

 

అయితే రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతల్ని కలిసేందుకు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. అసలు ఆయనకు బీజేపీ అగ్రనేతలు అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అనే సందేహాలు కూడా తలెత్తాయి. అయితే ఈ భేటీలో జేపీ నడ్డా వారికి ఏం చెప్పారు.. జనసేన అధినేత వారి ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Posted Under AP
Editor