ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లియో. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లోకేష్ యూనివర్స్ కథలలో భాగంగానే ఉండనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో లోకేష్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కాశ్మీర్ లో జరగబోతునుంది. అక్కడ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. లోకేష్ దర్శకత్వంలో ఇది వరకు వచ్చిన సినిమాల కంటే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ మూవీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మూవీ బిజినెస్ మొత్తం జరిగిపోయిందనే మాట వినిపిస్తుంది.
లియో మూవీ థీయాట్రికల్ బిజినెస్ 150 కోట్ల వరకు జరిగిందని సమాచారం. ఇక డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి 250 కోట్లకి ప్రముఖ కంపెనీ కొనుగోలు చేసిందని సమాచారం. ఈ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి ఈ స్థాయిలో ఒటీటీ సంస్థ ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. మొత్తం ఈ మూవీ 400 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. కోలీవుడ్ హిస్టరీలోనే ఇంత పెద్ద మొత్తంలో సినిమా షూటింగ్ లో ఉండగానే బిజినెస్ జరగడం సంచలనం అని చెప్పాలి. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీకి కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు. అలాగే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు షూటింగ్ దశలోనే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలకి మాత్రమే సాధ్యం అయ్యింది. మరల ఇప్పుడు లోకేష్ కనగరాజ్, విజయ్ మూవీకి ఆ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా కావడం వలనే ఈ మూవీకి ఇంత భారీగా బిజినెస్ జరిగింది అనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.
