మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్-బీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28), హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (44) రాణించడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. తొలుత వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ, మన అమ్మాయిలు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఫైనల్‌గా జట్టుని గెలిపించారు. Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..? తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్..
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత కెప్టెన్ హేలీ మాథ్యూస్ వెంటనే ఔట్ అవ్వడంతో.. విండీస్‌కి గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన క్యాంప్‌బెల్(30)తో కలిసి స్టెఫనీ టేలర్ జట్టుని ముందుకు నడిపించింది. వెంటనే మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కి ఈ ఇద్దరు 73 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక చివర్లో చెడియన్ (21), షబికా (15) పర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుక సింగ్ & పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో, అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది.
