ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పొత్తులు, ఎత్తులతో రసవత్తరంగా మారుతోంది. ఓ పార్టీ ఏపీలో జెండా పీకేస్తోందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలని చర్చ నడుస్తోంది. ఇంతకీ జెండా పీకేసే పార్టీ ఏది ? ఆ పార్టీని ఏపీ నుంచి లేపేసే స్కెచ్ ఎవరు వేశారు ? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి. vishnu vardhan reddy ఏపీ బీజేపీ నేత విష్లువర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ హాట్ టాపిక్ గా మారాయి. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ జెండా పీకేస్తోందని కామెంట్ చేశారు. వైసీపీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్న ఏక్ నాథ్ షిండేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. వైసీపీలోని కొందరు కీలక నేతలతో మొదటి నుంచి బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏపీలోని ఓ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అదే జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తన ప్రత్యర్థుల్లాగే సీఎం కావాలని ఎంతో ఆశతో ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. అదే సందర్భంలో సీఎం జిల్లాకు చెందిన కీలక నేత జాతీయ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. సీఎం నుంచి ఏదైనా వ్యతిరేకత ఎదురైతే వెంటనే జాతీయ పార్టీలోకి తన అనుచర వర్గ ఎమ్మెల్యేలతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
2024లో ఆ పార్టీని ఏపీ నుంచి లేపేసేందుకు బీజేపీ స్కెచ్
