ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈసారి 5.5 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత వారం పదిరోజుల్నించి ఇండోనేషియాలో భూమి కంపిస్తోంది. 1-2 సార్లు సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఇప్పుడు మరోసారి టొబెలోకు వాయవ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సముద్రమట్టానికి 12 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అంతకుముందు అంటే జనవరి 16వ తేదీన ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూ అంతర్భాగంలో 151 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ఇండోనేషియాలోని సింగ్‌కిల్ నగరానికి ఆగ్నేయంగా 40 కిలమీటర్ల దూరంలో..సముద్రమట్టానికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. మరోవైపు తూర్పు జావా ప్రావిన్స్‌లో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఒకరు మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. పలు గ్రామాలు, నగరాలను ఖాళీ చేయించారు. సెమెరు పర్వతం పేలిన ఘటన ఇది. ఇక ఉత్తరాఖండ్‌లో సైతం భూమి కంపించింది. పితోర్‌గఢ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. దేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో తరచూ 3-3.8 తీవ్రతతో భూమి కంపిస్తూనే ఉంటుంది.

Editor