ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రాూ యూనివర్శిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీపై బిబిసి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇండియా: ది మోదీ క్వశ్చన్ ప్రదర్శించేందుకు యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలు ప్లాన్ చేసుకున్నాయని సమాచారం అందుకున్న యూనివర్శిటీ రిజిస్ట్రార్..
ఆ ప్రదర్శనను నిలిపేయాల్సిందిగా విద్యార్థులకు ఆదేశాలు జారీచేశారు. యూనివర్శిటీ అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ఈ డాక్యుమెంటరనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
యూనివర్శిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శించడం వల్ల యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. అంతేకాకుండా
జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్
ఆదేశాలను ఉల్లంఘించి డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టయితే.. వారిపై యూనివర్శిటీ నిబంధనల కింద కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.
