2023 కాలెండర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విధ్యర్థుల సంక్షేమ సంఘం ముద్రించిన 2023 కాలెండర్ ను సంస్థ గౌరవాధ్యక్షులు ,బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు.
యాంకర్ :2021 నుండి నేటి వరకు సొసైటీ ద్వారా కేవండర్ ముద్రణ జరుగుతుందని సత్యకుమార్ తెలిపారు.కేలండర్ తయారు చేయడానికి శ్రమించిన కమిటి సభ్యులను ఆయన అభినందించారు.తమ సొసైటీ ద్వారా సభ్యులకే కాకుండా ఇతరులకు అవసరమైన సహాయం చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు.ఆంద్రప్రదేశ్ లో కాకినాడ ,హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన వారికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సత్యకుమార్ తెలిపారు.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ ,కర్నాటక,తమిళనాడు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు జిల్లాలో వారిగా రక్తదాన శిబిరాలు,అన్నదానం ,వస్త్ర దానం ,అనాదఆశ్రమాలు ,వృద్దాశ్రమాలు పాఠశాలలందు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సత్యకుమార్ అన్నారు.సామాజిక లోనే లక్ష్యంగా సొసైటీ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.సొసైటి అధ్యక్షులు ,కేలండర్ కమిటి సభ్యులు ,సత్యన్న సేన కలిసి సత్యకుమార్ ను ఘనంగా సన్మానించారు.సొసైటీ ఉపాధ్యక్షులు పిల్లి రమేశ్ ,కెలండర్ కమిటి కన్వీనర్ దుడ్డు నారాయణ ,సొసైటి కార్యదర్శి మీసాల ప్రేమ్ కుమార్ ,కోశాధికారి కూర శ్రీనివాస్ ,సలహాదారు బి.రవీందర్ ,ఈసి సభ్యులు లక్ష్మీకాంత్ , రాజారావు ,సత్యన్న సేన సభ్యులు యం ప్రసాద్ నాయుడు ,యన్ గురుర్రసాద్ ,దాసేది చారీ మరియు జియంఆర్ మిత్రులు పాల్గొన్నారు.

Editor