తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. ఆదివారం మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు, ఉన్నత అధికారులతో టీటీజేఏసీ నాయకులు సమావేశం అయ్యారు. పదోన్నతులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందజేసిందన్నారు.
ఉపాధ్యాయులకు త్వరలో ప్రమోషన్స్, బదిలీలు ఇవ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని.. అందుకు ప్రాసెస్ మొదలు అయిందని తెలిపారు. 9,266 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మంత్రులు రూపొందిస్తున్నారు. మంత్రులతో భేటీలో తమ ఇబ్బందులు, సమస్యలను టీటీజేఏసీ నాయకులు వివరించారు. వీటన్నింటికి సానుకూలంగా స్పందించిన మంత్రులు.. సీఎం కేసీఆర్‌తో చర్చించిన అనంతరం పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
