యాక్సిడెంట్ తర్వాత.. ఇన్‌స్టాలో రిషబ్ పంత్ మొదటి పోస్ట్‌

క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చాడు. దిల్లీ-డెహ్రాడూన్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ పంత్ పెద్ద రోడ్డు ప్రమాదానికి(Car Accident) గురయ్యాడు. ఆ తర్వాత పంత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు అయ్యాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పంత్ అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఒక పోస్ట్ చేశాడు. తన శస్త్రచికిత్స, కోలుకోవడం గురించి చెప్పుకొచ్చాడు. ‘అందరి మద్దతుకు, నా మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞుడను. నా శస్త్రచికిత్స విజయవంతమైందని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కోలుకునే సమయంలో ఉన్నాను. ఉత్సాహంగానే ఉన్నాను. నేను ప్రతిరోజూ మంచిగా ఉన్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ మంచి మాటలు, మద్దతుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

‘ అని రిషబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. గాయాలు ఎక్కువగా ఉన్న కారణంగా.. 2023లో క్రికెట్ ఆటకు దూరంగా ఉండనున్నాడు పంత్. ఎంతగానో ఎదురుచూసిన.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా పంత్ ఆడటం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్‌కు సైతం దూరంగానే ఉండనున్నాడు. అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్‌(World Cup)కు పంత్ దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు ప్రమాదం(Car Accident)లో గాయం కారణంగా కాలికి కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు మరో సారి శస్త్రచికిత్సకు చేసుకోనునున్నాడు. మరో నాలుగు వారాల్లో చికిత్స జరిగే అవకాశం ఉంది. తగిలిన గాయాలు తగ్గే వరకు విశ్రాంతిలో పంత్ ఉండనున్నాడు. దీంతో 2023లో పంత్ క్రికెట్ ఆడతాడా అని ప్రశ్నలు వస్తున్నాయి.

Editor