మళ్లీ నితిన్, రష్మికనే దిక్కయ్యారా?.. వెంకీ కుడుములను పక్కకు పెట్టేసిన చిరంజీవి

వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాలతో మంచి సక్సెస్‌ను రుచి చూశాడు. అయితే వెంకీ కుడుముల తన చిరకాల కోరిక అంటూ చిరంజీవితో సినిమా తీయాలని ఉండేదట. చిరంజీవితో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తాడంటూ అఫిషియల్ ప్రకటన కూడా వచ్చింది. కానీ చివరకు ఈ ప్రాజెక్ట్ మాత్రం పక్కకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్‌కు చిరంజీవి నో చెప్పినట్టు తెలుస్తోంది. ముందుగా చిరంజీవి అయితే వెంకీ కుడుముల చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తోంది. కానీ స్క్రిప్ట్ విషయంలో మాత్రం చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా తీయాలని ఆశపడ్డ వెంకీ కుడుములకు మాత్రం భంగపాటు ఎదురైనట్టుంది.

చిరంజీవితో సినిమా చేయాలని స్క్రిప్ట్ చేస్తూ అలానే ఏడాది టైం వేస్ట్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి చిరంజీవితో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో వెంకీ కుడుముల చేసేదేం లేక మళ్లీ తన హీరో, హీరోయిన్ల వద్దకే వెళ్లాడు. ఛలో సినిమాతోనే రష్మికతో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆ పరిచయంతోనే వెంకీ కుడుముల భీష్మ సినిమాకు ఒప్పించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా రష్మికతో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భీష్మ సినిమాలో నితిన్, రష్మిక మందాన్న కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. భీష్మ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ ఇలా అన్నింట్లో వెంకీ కుడుముల తన మార్క్ చూపించాడు. దీంతో మరోసారి ఓ కొత్త పాయింట్ చెప్పి నితిన్‌ను, రష్మికను ఒప్పించాడట. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోందట. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోన్నారట. అంటే మరోసారి భీష్మ మ్యాజిక్ రిపీట్ కాబోతోందన్నమాట.

Editor