Latest Posts

900 కి.మీల దూరంలో ఉన్న కవలలు.. ఒకే సారి వింతగా చనిపోయారు..

కొన్ని యాదృశ్చికంగా జరుగుతాయో లేక ఏదైనా బలమైన కారణం ఉందో తెలియదు. కానీ ఆ మిస్టరీలు ఇప్పటికీ కూడా అంతుబట్టడం లేదు. దాదాపు 900 కి.మీల దూరంలో విడివిడిగా ఉన్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు ఎలా చనిపోయారన్నది తేలలేదు. రాజస్థాన్‌లో 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు ఈ విచిత్రమైన సంఘటనలో రాజస్థాన్‌లో జరిగింది.

ఒకే రోజు 26 ఏళ్ల కవలలు ఒకే విధంగా మరణించారు. ఒకరికొకరు 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు, ఒకరు బార్మర్‌లో ఉండగా.. మరొకరు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో నివసిస్తున్నారు. సోదరులు ఇద్దరూ ఒకే రీతిలో విచిత్రంగా మరణించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఒకరు తన ఇంటి టెర్రస్ నుండి జారిపడి మరణించగా.. మరొకరు వాటర్ ట్యాంక్‌లోకి జారిపోయి చనిపోయారు.రాజస్థాన్ కు చెందిన ఇద్దరు కవలలు సోహన్ సింగ్ మరియు సుమేర్ సింగ్‌లను వారి స్వగ్రామమైన సార్నో కా తాలాలో ఒకే చితిపై దహనం చేశారు.

Editor