అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా

అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నిఅందుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్లు శ్వేత షెరావత్ 92 రన్స్ నాటౌట్‌, షెఫాలీ వర్మ 45 పరుగులతో రాణించాడు. వీరిద్దరి బ్యాటింగ్ మెరుపులతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది.

సిమోన్ లౌరెన్స్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మ్యాడిసన్ లాండ్స్‌మన్ 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షెఫాలీ వర్మ రెండు వికెట్లు దక్కించుకున్నది. 167 పరుగులు టార్గెట్‌తో బరిలో దిగిన భారత్‌కు శ్వేత, షెఫాలీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. షెఫాలీ వర్మ, శ్వేత ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించారు. షెఫాలీ 16 బాల్స్‌లోనే తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 రన్స్ చేసింది. శ్వేత 57 బాల్స్‌లో 20 ఫోర్లతో 92 రన్స్ చేసింది. వీరిద్దరి జోరుతో 16.3 ఓవర్లలోనే భారత్ 170 పరుగులు చేసింది. తర్వాత మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌, యూఏఈలతో టీమ్ ఇండియాతలపడనుంది.

Editor