డైమండ్ రాణి రోజా వ్యాఖ్యలపై మంత్రి ఫైర్.

తాను ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటున్నానని.. చివరికి డైమండ్ రాణి రోజా కూడా తన గురించి మాట్లాడుతోందని అంటూ మంత్రి రోజాపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

రెండు చోట్ల ఓడిపోయినోడని డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుందన్నారు. యువత కోసం డైమండ్ రాణితో కూడా తిట్టించుకోవడానికి సిద్ధమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. రెండు సార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌తో తిట్టించుకోవాలా..? తూ.. ప్రజల కోసం తప్పట్లేదని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. రెండు సార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన..@PawanKalyan నీతో తిట్టించుకోవాల..? తూ… ప్రజల కోసం తప్పట్లేదు.

Editor