Latest Posts

హిడ్మా మృతిపై క్లారిటీ.. మావోయిస్టు కమిటీ లేఖ విడుదల

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మవోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోలేదని స్పష్టం చేసింది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖను రిలీజ్ చేసింది. ‘హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్‌గా ఉన్నాడు. దక్షిణ బస్తార్‌లోని జంగిల్ కొండలపూ పోలీసులు, సీఆర్పీఎఫ్‌, డ్రోన్‌లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశారు. వైమానిక దాడులకు పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు.

ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలి..’ అని మవోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ-బీజాపూర్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా మరణించారని మొదట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనతో పాటు పలువురు నక్సలైట్లు హతమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. హిడ్మా మృతి చెందలేదని మవోయిస్టు లేఖ ద్వారా స్పష్టమైంది. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉందని చెబుతున్నారు. 2010లో తడ్‌ మెట్ల వద్ద మెరుపు దాడి చేసి 24 మంది జవాన్లను హతమార్చిన కేసు, 2013లో కాంగ్రెస్‌ నేతలను ఊచకోత ఘటన, 2017 సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసి హత్య ఘటనలకు హిడ్మానే ప్రధాన వ్యూహకర్త అని తెలుస్తోంది. 2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కు కుని 22 మంది బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Editor