Latest Posts

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం మునిగడప శివారు మల్లన్నగుడి వద్ద కారు అదుపు తప్పింది. దాంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు.

ఇంకొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలుస్తోంది. కారు గుంతలో పడడం చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి.. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు. కారును గుంతలోంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe

Editor