బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో కొత్త అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఎన్నికకు వ్యతిరేకంగా మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వీధుల్లో హింసాత్మకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంట్ హౌస్) నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసనకారులు సుప్రీంకోర్టు లోపలికి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దాదాపు 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.
బ్రెజిల్‌లో ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు . బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వాను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. “రాజధాని బ్రెసిలియాలోని దేశ సంస్థలలో అల్లర్లు, విధ్వంసక చర్యలు, హింసాత్మక ప్రదర్శన గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. మేము బ్రెజిల్ ప్రభుత్వానికి మేము పూర్తి మద్దతును తెలుపుతున్నాము” అని పీఎం మోదీ ట్వీట్ చేశారు
