నాడు-నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ, బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునాతనమైన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా.సత్యనారాయణ చావా తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన ఆయన రూ.4 కోట్ల చెక్‌ను అందజేశారు. నాడు -నేడు పథకం కోసం లారస్‌ ల్యాబ్స్‌ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి కావడం విశేషం.

Posted Under AP
Editor