Latest Posts

జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద తీవ్ర కలకలం.. ఆర్థిక సాయం కోరుతూ అభిమాని ఆత్మహత్యాయత్నం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన సుచిత్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ ఇంటి ముందు హంగామా సృష్టించాడు. తన అప్పులు తీర్చడానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ ఆయన నివాసం ఎదుట ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్సీని ప్రదర్శించాడు.

ఈ క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, సుచిత్ బాడీగార్డ్‌పై దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. అనంతరం తీవ్ర ఆవేశంతో తన ఛాతీ, చేతులపై పదునైన వస్తువుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్తస్రావంతో గాయపడిన సుచిత్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Editor