శ్రీ సత్య సాయి జిల్లా
హిందూపురం:
హిందూపురం నియోజకవర్గం లోని మూడు మండలాల్లో నూతన మండలl పరిషత్ పాలకవర్గం ఏకగ్రీవంగాఎంపికైంది.ఈ సందర్భంగా
ఎన్నికలరిటర్నింగ్ అధికారుల సమక్షంలోఆయా మండల పరిషత్ కార్యాలయంలో తొలుత ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం గావించారు. అనంతరం ఎంపీపీలు.వైస్ ఎంపీపీలచే ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. హిందూపురం రూరల్ మండల పరిషత్ అధ్యక్షులుగా మంజునాథ్,వైస్ ఎంపీపీ గా అశోక్, లేపాక్షి మండల పరిషత్ అధ్యక్షుడుగా ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీగా సాలెహ, చిలమత్తూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా గీతమ్మ, వైస్ ఎంపీపీ గా సజ్జప్పలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీలు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వారికి ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆశీస్సులు తొలి సంతకాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి కోసం ఎంతగానో కృషి చేశామనిమా కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్యే బాలకృష్ణ తమను ఎంపీపీలుగా అవకాశం కల్పించి నిలిపారని ఆయనకు జీవితం ఉన్నంతవరకు రుణపడి ఉంటామని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఇటు అధికారులు ప్రోత్సాహం అటు ఎంపీటీసీల సహకారంతో మండల ప్రజాభివృద్ధికి పాటుపడతామని నూతన ఎంపీపీలు పేర్కొన్నారు. నూతన మండల పరిషత్ పాలకవర్గ సభ్యులకు అధికారులు. టిడిపి నాయకులు విడివిడిగా ఘనంగా సన్మానం చేశారు
బైట్స్:
మంజునాథ్, నూతనంగా హిందూపురం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి
