Latest Posts

ఎస్ టి ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్..

 

 

  • ఎస్ టి ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
  • నషాముక్తి భారత్ ఫర్ భారత్ అంశంపై యువత చర్చలు

మాదకద్రవ్యాల వినియోగం వాటి చెడు ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన, సత్యసాయి జిల్లా మై భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ (Viksit Bharat Youth Parliament – VBYP) కార్యక్రమం నవంబర్ 9న కదిరిలోని ఎస్టీ ఎస్ఎన్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నషా ముక్కు భారత్ ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై జిల్లా నలుమూలల నుంచి హాజరైన యువతీ యువకులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను సభలో వ్యక్తపరిచారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత ఏ విధంగా నష్టపోతోంది వాటిని నివారించి అభివృద్ధి చెందిన భారత్గా ఎలా ఎదగాలి అని వాదనలను వినిపించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి ఐశయ్య గారు మరియు డిజేబుల్ వెల్ఫేర్ ఎడి అర్చన గారు, కళాశాల ప్రిన్సిపల్ సలీం భాష గారు జిల్లా స్టీల్ డెవలప్మెంట్ అధికారి హరికృష్ణ గారు, మరియు యువజన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ గార హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు యువతలో నాయకత్వ లక్షణాలను, వాక్చాతుర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నేటి కాలంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని వీటిని నివారించి భారతదేశ అభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషించాలని వారు తెలియజేశారు
కార్యక్రమంలో పోటీల న్యాయనిర్ణేతలుగా వెంకటేశ్వర్ ప్రసాద్ గారు , హైదర్ అలీ గారు, కృష్ణ నాయక్ గారు, యాసిన్ ఆలీ గారు పాల్గొని యువత ప్రసంగాలను పరిశీలించి, అంశంపై తమ విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు.
మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ టి. ఐజయ్య మాట్లాడుతూ, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు అభ్యర్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన యువత జనవరి 12న నిర్వహించనున్న జాతీయ యువజన ఉత్సవాలు – వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు, పాల్గొన్న యువతీ యువకులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమం యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, జాతీయ అభివృద్ధిపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడింది.
ఇట్లు,
టి. ఐజయ్య
జిల్లా యువజన అధికారి
మై భారత్ కేంద్రం, నంద్యాల

Posted Under AP
Editor