ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సాయిపల్లవి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఈ ఈవెంట్‌కు ఆమె సాంప్రదాయ చీరకట్టులో విచ్చేసి తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన సాయిపల్లవి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చీరకట్టులో మెరిసిన సాయిపల్లవి.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యూట్ ఫొటోలు వైరల్!




