ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. తాజాగా ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్, ప్రముఖ హీరోయిన్ మృణాళిని రవి పెళ్లిపీటలెక్కింది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో కలిసి ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మలేషియా సమీపంలోని ప్రఖ్యాత లంగకవి ఐలాండ్ వేదికగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది.
ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక ఘనంగా నిర్వహించబడింది. పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను మృణాళిని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మొదట మంచి స్నేహితులుగా ఉన్న మృణాళిని రవి, మహావిష్ణు కాలక్రమేణా ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లుగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019లో ‘సూపర్ డీలక్స్’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన మృణాళిని.. తెలుగులో ‘గద్దలకొండ గణేష్’, ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
