డి.హీరేహాల్ మండలంలో ఎన్నికలకు భారీ బందోబస్తు…

  • డి.హీరేహాల్ మండలంలో ఎన్నికలకు భారీ బందోబస్తు
  • ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఎస్సై గురుప్రసాద్ రెడ్డి

డి.హీరేహాల్ నవంబర్ 3
Yes 9 TV News

ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలో ఒక జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, 13 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు మొత్తం 16 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై కోరారు. ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Posted Under AP
Editor