Latest Posts

ఒక్క అవకాశం ఇవ్వండి.. మారంపల్లి సమగ్ర అభివృద్ధే లక్ష్యం: కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి

ప్రెస్ నోట్

02-11-2026

మారంపల్లి ఎంపీటీసీ కి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున MPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊరువాకిలి అనిల్ కుమార్ తో కలిసి, దేవిరెడ్డి పల్లి గ్రామంలో ఓటర్లను కలిసి, ఒక్క అవకాశం ఇస్తే మారంపల్లి ఎంపిటిసి పరిధిలో మౌలిక వసతులైన, డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి సరఫరా తదితర అన్ని వసతుల కల్పనకై కృషి చేస్తామని, అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల అసంతృప్తిని తెలియజేయాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థించిన గౌని ప్రతాప్ రెడ్డి, ఇంచార్జ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాయదుర్గం నియోజకవర్గం.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, ఓబిసి జనరల్ సెక్రటరీ వసంత్ గౌడ్, జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు ఎర్రి స్వామి రెడ్డి, బొమ్మంతం రాజు, సిద్ధప్ప, నగేష్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor